ఆవిడో హాట్ యాంకర్. టీవీలో పేరు సంపాదించుకుని సినిమాల్లోనూ వెలిగిపోయేందుకు ట్రై చేస్తోంది. వెండి తెరను వేడెక్కించడంలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టుకోని ఈమె.. ఐటెం సాంగ్స్ చేసేందుకు కూడా కూడా సై అంటూ సందేశాలు పంపుతోందట. అయితే.. ఈమెకు పోలీసులను పిలుపు రావడం హాట్ టాపిక్ అయిపోతోంది.
రీసెంట్ గా హైద్రాబాద్ లో జరిగిన ఓ పార్టీకి ఈమె హాజరైంది. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు కానీ.. పార్టీ పూర్తయ్యే సరికి ఈమె ఫుల్లుగా తాగేసిందట. ఆ తర్వాత అక్కడ నానా రచ్చా చేసేయడంతో.. పార్టీకి వచ్చిన మిగిలిన వాళ్లు ఇబ్బందిపడిపోయారు. ఈమెకు నచ్చచెప్పేందుకు ఎంతగా ప్రయత్నించినా.. ఏ మాత్రం కంట్రోల్ కాలేదట. దీంతో విసుగెత్తిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చేశారు. అయితే.. పోలీసులు వచ్చేప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయిందట ఈ బ్యూటీ.
కంప్లెయింట్ చేసినవాళ్లు కూడా పలుకుబడి ఉన్నవాళ్లే కావడంతో.. ఆ భామను పిలిపించారట పోలీసులు. కౌన్సెలింగ్ అంటున్నా.. కాస్త గట్టిగానే క్లాస్ పీకారని టాక్. మరోసారి ఇలాంటి కంప్లెయింట్ వస్తే మాత్రం.. న్యూసెన్స్ కేసు పెట్టడం ఖాయమని కూడా అన్నారట. దీంతో సైలైంట్ అయిపోయిన ఆ హాట్ యాంకర్.. మెల్లగా నచ్చచెప్పుకుని అక్కడి నుంచి బయటపడిందని అంటున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి