”జనతా గ్యారేజ్” సినిమా తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటికే భారీ విజయాన్ని సాధించిన జనతా గ్యారేజ్ సినిమా తరువాత మళ్ళీ ఆ రేంజ్ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పటికే అయన త్రివిక్రమ్ , అనిల్ రావిపూడి, పూరి జగన్నాధ్ లాంటి దర్శకులతో చర్చలు జరిపాడు. ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఏమిటి ? అనే సందేహం అయన ఫాన్స్ లో మొదలైంది. అయితే ఆలస్యం అయినా కూడా ఎన్టీఆర్ ఇప్పుడు ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పనున్నాడు .. అదికూడా నాలుగు సినిమాలతో ? అవునా !! అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే .. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడి తో చేయడానికి ఓకే చెప్పాడు, దాంతో పాటు పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ సినిమా కూడా అనౌన్స్ కానుంది, ఇక ఈ లిస్ట్ లోకి మరో దర్శకుడు చేరాడు .. ఆయనే ఇటీవలే ”ప్రేమమ్” తో మంచి విజయాన్ని అందుకున్న చందు మొండేటి ? ఈ నలుగురు దర్శకులతో సినిమాలు అనౌన్స్ చేయడానికి సిద్ధం అయ్యాడు ఎన్టీఆర్. వచ్చే నెలలో ఈ ప్రకటన రానుందట.
తన కెరీర్ లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తరువాతి సినిమా కూడా ఆ స్థాయిలో ఉండాలనే ప్లాన్ లో భాగంగా అయన పావులు కదుపుతున్నారు. ఇక ‘జనతా గ్యారేజ్’ విడుదలై చాల రోజులు అవుతుంది. ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటున్న ఎన్టీఆర్ లుక్ ఒకటి సంచలనం రేపుతోంది ? అసలు ఎన్టీఆర్ ఏంటి ఇలా తయారయ్యాడు ? అని ఫాన్స్ షాక్ అవుతున్నారు. నిజమే ఎన్టీఆర్ ఈ లుక్ ని చూసి నెక్స్ట్ సినిమా కోసం అనుకునే ఛాన్స్ ఎలాగూ లేదు. మరి ఎందుకు ఎన్టీఆర్ ఇలా తయారయ్యాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఇక ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను ‘పటాస్’ ఫేమ్ .. అనిల్ రావిపూడి తో చేస్తాడని వార్తలు వస్తున్నాయి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి