‘నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ నుండి చాలా పేర్లు హల్చల్ చేసినప్పటికీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. అయితే అసలు జూనియర్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? అనే అంశాన్ని అడ్డం పెట్టుకుని… యంగ్ టైగర్ ఓ సరికొత్త రాజకీయ పార్టీని కూడా స్థాపించబోతున్నారన్న వార్తలు పుట్టుకొచ్చాయి.
బహుశా ఇలాంటి పుకార్లకు ఇక శుభం కార్డు వేయాలని భావించారో ఏమో గానీ, ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజతో ‘పవర్’ సినిమాను తెరకెక్కించి, టాలీవుడ్ కు పరిచయమైన బాబీ, ఆ తర్వాత ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాను తీసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ దర్శకుడికే ‘ ఎన్టీఆర్ ఓటు వేసారన్న విషయం దాదాపుగా ఖరారైంది.
మాస్ అంశాలను ఎలివేట్ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన బాబీ చెప్పిన స్క్రిప్ట్ బాగా నచ్చిందని, అందుకే తన సోదరుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లోనే ఈ సినిమాను నిర్మించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అతి త్వరలోనే వెల్లడి కానుందని తెలుస్తోంది. మొత్తానికి టాప్ దర్శకులతోనే చేయాలన్న నియమాలు పెట్టుకోకుండా కధలకు తగ్గట్టుగా జూనియర్ అడుగులు వేయడంతో, ఈ స్క్రిప్ట్ పైన కూడా యంగ్ టైగర్ అభిమానులు నమ్మకాలు పెట్టుకుంటున్నారు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి