రజినీ రోబో 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక రోల్


రజనీకాంత్‌ హీరోగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీక్వెల్‌ చిత్రం ‘2.0’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమం ముంబయిలో మొన్న ఆదివారం హంగామాగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫస్ట్ లుక్ ఫంక్షన్ తో ఒక్కసారిగా సినిమాపై ఓ రేంజిలో హైప్ క్రియేట్ అయ్యింది. జనాల్లో ఈ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది ఓకే..ఇప్పుడు ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ క్రేజ్ తెచ్చి మార్కెట్ చేయాలనేది నిర్మాతల నెక్ట్స్ వ్యూహం గా కనపడుతోంది. ఆల్రెడీ ఈ సినిమాలో రజనీకాంత్‌ హీరో కాబట్టి తెలుగు,తమిళంకు పెద్ద బాధ లేదు. ముఖ్యంగా తమిళం వాళ్లు ఎగబడి చూస్తారు. అయితే తెలుగునుంచి కూడా ఓ స్టార్ హీరో ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన దర్శక,నిర్మాతలకు ఉందిట
హిందీకోసం ..అక్షయ్‌ కుమార్‌ ఉన్నాడు కాబట్టి బాలీవుడ్‌లో మంచి ప్రమోషన్‌ లభిస్తుంది. మరి, తెలుదు మాటేమిటి. అందుకే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్‌ హీరోతో ఇందులో ఓ స్పెషల్‌ రోల్‌ చేయించాలని డిసైడ్‌ అయ్యి, చర్చలు జరుపుతున్నట్లు మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.   నిజమైతే సూపర్   ఇక ఈ చిత్రంలో గెస్ట్ రోల్ గా చేయటానికి ఎన్టీఆర్ ని అడిగారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సైతం…తమిళనాట ఈ సినిమాతో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారట. మొదట ప్రభాస్ ని అడిగినా ..బాహుబిలి బిజిలో ఉన్నారని చెప్పార. ఎన్టీఆర్ ని అడిగింది నిజమే అయితే సూపర్ అంటున్నారు అభిమానులు. ఈ చిత్రంలో గెస్ట్ గా చేసే హీరో కనపడేది చాలా తక్కువ సేపే అంటున్నారు. అయితే రెమ్యునేషన్ మాత్రం గట్టిగా ఇస్తారని చెప్పుకుంటున్నారు. అయితే గెస్ట్ గా చేసే హీరో ఎవరన్నది ఆడియో రిలీజ్ రోజు రివీల్ చేయాలని ఫిక్స్ అయ్యారట.  


కామెంట్‌లు