సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయ్యి రికార్డుల వరకు ఇలా ప్రతీది మీడియాలో పెద్ద సంచలనమే. ఇటీవల రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా విషయంలో ఇంకా ఎవ్వరికి క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా విషయంలో ఓ షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నట్టు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఇప్పటికే తన లుక్స్ విషయంలో ఇప్పటికే చాలా సార్లు ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు.
రాఖీ ఎన్టీఆర్‌కు యమదొంగ ఎన్టీఆర్ లుక్‌కు చాలా తేడా ఉంది. ఇక కంత్రీలో కూడా ఎన్టీఆర్ సరికొత్త లుక్‌లో కనిపించాడు. ఇక నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ లుక్ సైతం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌నే కాదు… టోటల్ తెలుగు సినిమా ఇండస్ట్రీని సైతం ఎన్టీఆర్ వైపు తిప్పేలా చేసింది.
ఇక ఎన్టీఆర్ తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమార్తె రిసెప్షన్‌లో ఓ కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ లుక్ ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు కారణమైంది. ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా కోసమే ఈ కొత్త లుక్‌ను మెయింటైన్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తమిళ డైరెక్టర్ బాలా డైరెక్షన్‌లో ఎన్టీఆర్ కొత్త సినిమా ఉంటుందని… అందుకే ఈ లుక్ మెయింటైన్ చేస్తున్నాడని…సినిమా ఎనౌన్స్ అయ్యే వరకు ఈ విషయాన్ని ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుతాడని తెలుస్తోంది. ఏదేమైనా ఈ కొత్త లుక్‌లో ఎన్టీఆర్‌ను చూసిన వారు మాత్రం ఎన్టీఆర్ డెసిషన్ ఏమై ఉంటుందా అని తెగ ఆలోచించేస్తున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి