‘జనతా గ్యారేజ్’ సూపర్ సక్సస్ తరువాత మంచి జోష్ లోకి వెళ్ళిపోయిన జూనియర్ అభిమానులు తమ అభిమాన హీరో నటించబోయే లేటెస్ట్ మూవీ గురించి ఎదురు చూస్తూ ఉంటే లేటెస్ట్ గా బయట పడ్డ జూనియర్ లుక్ తారక్ అభిమానులను విపరీతంగా కలవర పెడుతోంది. కొద్ది రోజుల క్రితం జూనియర్ ను కలిసిన ఒక వీరాభిమాని ఈ లుక్ లో తన అభిమాన హీరోను చూసి షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో జూనియర్ తన కొత్త సినిమా కోసం ఇలాంటి లుక్ తో ప్రిపేర్ అవుతున్నాడా ? లేదంటే ఏదైనా దేవుడి మొక్కు తీర్చుకోవడం కోసం ఒక జ్యోతిష్కుడి సలహాతో ఇలా మారిపోయాడా ? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. జూనియర్ కళ్యాణ్ ‘ఇజం’ ఆడియో వేడుకలో కనిపించినప్పుడు బాగా లావుగా కనిపించినా అప్పటికి ఇంత గుబురు గడ్డంతో జూనియర్ లేడు.
అయితే ఆ ఫంక్షన్ జరిగి ఇంచుమించు రెండు నెలలు అవుతున్న నేపధ్యంలో ఇప్పుడు జూనియర్ ఇలా తిరిగి తన ‘నాన్నకు ప్రేమతో’ లుక్ లో కనిపిస్తున్న నేపధ్యంలో జూనియర్ కు ఏమైంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తన లేటెస్ట్ సినిమా గురించి ఆ సినిమా దర్శకుడు గురించి ఎటువంటి లీకులు ఇవ్వని జూనియర్ ఇలా కనిపించడం వెనుక ఎదో ఒక కారణం ఉండి ఉండాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి