అవార్డ్స్ అవసరంలేదంటున్న భామ..


ఏ హీరోయినైనా నాకు పాలనా అవార్డు వస్తే బాగుండు..ఆ చిత్రం లో నా రోల్ బాగా వచ్చింది నాకు అవార్డు తప్పనిసరిగా వస్తుంది అని చెపుతుంటారు..కానీ ఈమె మాత్రం నాకు అవార్డు అవసరం లేదు..సినిమా బాగా ఆడితే చాలు..ఆ మూవీ లో నా రోల్ కు మంచి పేరు వస్తే చాలు అంటుంది.ఇంతకీ ఈమె ఎవరా అనుకుంటున్నారా..ఇంకెవరు మిల్కీ బ్యూటీ తమన్నా.

తాజాగా విశాల్ , తమన్నా జంటగా కత్తి సాందాయ్(తెలుగులో ఒక్కడొచ్చాడు) మూవీ లో నటించారు..ఈ మూవీ ప్రమోషన్ లలో పాల్గొన్న తమన్నా ను అవార్డుల పట్ల మీ అభిప్రాయమేమిటి అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పుకొచ్చింది..

నాకు అవార్డ్స్ అంటే పెద్దగా ఇష్టం లేదని , అవార్డ్స్ కోసం కాకుండా సినిమా హిట్ అవ్వాలని నటిస్తానని అలా కాకుండా సినిమా ప్లాప్ అయి నటించిన నాకు అవార్డ్స్ వస్తే ఎలాంటి కిక్ ఉండదని తెలిపింది..అంతే కాకుండా తను చేసే రోల్స్ లో కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా నటనకు కూడా ఆస్కారముండేలా చూసుకుంటానని చెప్పుకొచ్చింది. వాస్తవానికి ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, పెద్ద నోట్ల రద్దు దృష్ట్యా ఈ సినిమాను వాయిదా వేశారు చిత్ర నిర్మాతలు..ఇక ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది అతి త్వరలో చూపుతారట. ప్రస్తుతం తమన్నా బాహుబలి 2 లో నటిస్తుంది.


కామెంట్‌లు