తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆయన తనయుడు అక్కినేని నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. క్లాస్, మాస్ యాక్షన్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. టాలీవుడ్ లో ఆయనను మన్మథుడు, కింగ్ అని పిస్తారు. ఓ వైపు క్లాస్ మాస్ సినిమాలు తీస్తూనే మరోవైపు భక్తిరస చిత్రాలతో మురిపించే వారు. ఇప్పటికే అన్నమయ్య, రామదాసు, షిరిడీ సాయి లాంటి సినిమాల్లో నటించిన నాగార్జున ఇప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మద్య తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హర్రర్, కామెడీ, థ్రిల్లర్ సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ తోనే గత కొంత కాలంగా లారెన్స్ మంచి ఫామ్ లో ఉన్నారు.
ఇక జీనియస్ సినిమాతో దర్శకుడిగా మారిన యాంకర్ ఓంకార్ ఆ మద్య ‘రాజుగారి గది’చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా ‘రాజుగారి గది’కి సీక్వెల్ గా ఓంకార్ దర్శకత్వంలో `రాజుగారి గది2` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ఆ హారర్ థ్రిల్లర్ సినిమా రీసెంట్ గా ప్రారంభమైంది. అయితే ఈ చిత్రంలో నాగార్జున్ కొత్త అవతారంతో కనిపించబోతున్నాడట. ఇప్పటి వరకు ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించిన నాగార్జున ఈ చిత్రంలో గుండుతో కనిపించబోతున్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల కాలంలో నాగార్జున చేస్తున్న ప్రతి సినిమాలోనూ ఓ కొత్త రకమైన గెటప్ కనిపిస్తోంది. అయితే ఈ మద్య కుర్ర హీరోలు గడ్డాలతో సినిమాల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ అయిన మలయాళ సినిమా ‘ప్రేతమ్’ లో ఆ పాత్రధారి జయసూర్య గుండుతోనే కనిపిస్తాడు. మరి అదే పాత్రను తెలుగులో చేస్తున్న నాగ్ అందుకు ఒప్పుకుంటాడా? అన్నది చూడాలి. కథ నచ్చిందంటే నాగ్ కూడా ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి