తారక్ లాంటి వారు సినీ పరిశ్రమ కి అవసరం..


జూనియర్ ఎన్టీఆర్ ఇండస్టీకి వచ్చి 16 ఎళ్ళు అయింది. ఎన్నో రికార్డులను సాధించాడు. అయితే జూనియర్ ఈ 16 సంవత్సరాలలో మెత్తం 26 సినిమా లు తీశాడు. అంటే కోంచెం అటు ఇటుగా సంవత్సరానికి రెండు సినిమా లు తీశాడు. అంటే అది మాములు విషయం కాదు.

ఎందుకంటే ఈ కాలంలో సినిమా యావరేజ్ గా ఆడి కోంచెం స్టార్ డమ్ వస్తే చాలు, ఆ తరువాత సినిమా కు అంతకు మించి బడ్జెట్ కావాలి. ఖచ్చితంగా ఫారెన్ ట్రిప్ వెళ్ళాల్సిందే అంటారు.అంతే కాకుండా ఒక సినిమా కు మరోక సినిమా కు కనీసం సంవత్సరం ఐనా సరే గ్యాప్ కావాలి అంటారు, కానీ మన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అలా కాదు స్టార్ డమ్ ఉన్నా లేక పోయినా కెరియర్ మెత్తం ఒకేలా సినిమా లు చేశాడు.

అంత ఎందుకు నాన్న కు ప్రేమ తో సినిమా విడుదల అయినా నెల రోజుల కే జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ పాల్గోన్నాడు. ఆ సినిమా ని కేవలం ఎనిమిది నెలలోనే పూర్తి చేశాడు. దాంతో పాటు గా అనేక రికార్డు లను తన పేరు మీద వ్రాసుకున్నాడు.

ఇలా స్టార్ డమ్ ఉన్న హీరో సంవత్సరానికి రెండు సినిమా లు తీస్తే, అటు నిర్మాతలకు ,ఇటు బయ్యర్లకు అటు డిస్ట్రిబ్యూటర్ల కు లాబాలుంటాయి. ఎందుకంటే ఒక్క సారి స్టార్ డమ్ వచ్చాక అతని తరువాత సినిమా కు ఒపెనింగ్స్ అదిరిపోతాయి. అందుకే బయ్యర్లు కు చిన్న సినిమా లతో పాటు పెద్ద హిరోల సినిమా ల కోసం చాలా చాలా ఆసక్తి గా ఎదురు చూస్తూ ఉంటారు.
అంతేనా ఇక్కడ తారక్ సంవత్సరానికి రెండు సినిమా లు తీస్తునందుకు అభినందించక తప్పదు.

కామెంట్‌లు