ఎన్టీఆర్ దెబ్బకి 4 పిట్టలు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు కేవలం తెలుగు మార్కెట్ ని మాత్రమే వాడుకునేవాడు. కాగా తొలిసారిగా జనతాగ్యారేజ్ తో ఇతర భాషలలో కూడా అదరగొట్టాలి అని నిర్ణయం తీసుకుని ఘనంగా జనతాగ్యారేజ్ ని మలయాళంలో డబ్ చేశాడు. తమిళ్ లో డైరెక్ట్ తెలుగు వర్షన్ తోనే అదరగొట్టాడు.

కాగా మళయాళ౦లో సినిమా ఫ్లాఫ్ అయినా ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇక తమిళ్ లో అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ ఉందని చెప్పొచ్చు. ఇక వీటికి తోడూ కన్నడలో స్టార్ హీరోలకే షాక్ ఇచ్చేంత క్రేజ్ ఎన్టీఆర్ కి సొంతం.


అందుకే ఇకమీదట తాను చేయబోయే సినిమా ఏదైనా అన్ని భాషల్లో ఆడేలా యూనివర్సల్ సబ్జెక్ట్ ఉండేలా చూసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఎలాగూ మలయాళంలో మార్కెట్ దక్కింది-తమిళ్ లో డైరెక్ట్ తెలుగు వర్షన్ తోనే హిట్ కొట్టడంతో ఇకమీదట తాను తెలుగులో చేసే ప్రతీ సినిమా ఆ చోట్ల కూడా ఒకేసారి డబ్ అయ్యి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్.

కామెంట్‌లు