సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శంకర్ తీయనున్న 2.0 ( రోబో2) చిత్రంలో టాలీవుడ్ స్టార్ కూడా నటించనున్నారని కొద్ది రోజులుగా చిత్రసీమలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ హీరో ఎవరనేదానిపై స్పష్టత వచ్చింది. ఆ హీరో ఎవరో కాదు.. మన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఐశ్వర్యా రాయ్ జోడీగా రజినీ నటించిన సూపర్ హిట్ చిత్రం రోబోకు సీక్వెల్ గా ఈ 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
రజినీ కాంత్ కు ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. సూపర్ స్టార్ రజినీతో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, అమీజాక్సన్ నటిస్తుండటంతో ఈ చిత్రంపై ఇటు దక్షిణాది చిత్రసీమతో పాటు అటు బాలీవుడ్లో కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఈ సినిమాలో ఒక టాలీవుడ్ స్టార్ ను నటింపచేయాలని శంకర్ కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నారు. సినిమాలో పదిహేను నిమిషాల పాటు (గెస్ట్ రోల్) సదరు టాలీవుడ్ స్టార్ కనిపించేలా కథను మార్పుచేసి తొలుత ప్రభాస్ ను సంప్రతించారు. కానీ, బాహుబలి-2 తో బిజీగా ఉండటంతో ప్రభాస్ కు డేట్ల సమస్య వచ్చింది. దీంతో ఎన్.టి.ఆర్. అయితే ఈ గెస్ట్ రోల్ కు సరిపోతాడని భావించిన శంకర్ అతన్ని సంప్రదించారు. ఇందుకోసం భారీ మొత్తాన్ని రెమ్యూనరేషనుగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. రజినీ చిత్రం కావడంతో ఎన్.టి.ఆర్. కూడా ఈ రోల్ కోసం తల ఊపారని అంటున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి