జపాన్ లో జనతాగ్యారేజ్ రికార్డు...


టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషించే న్యూస్ ఇది….జనతాగ్యారేజ్ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ లో 85 కోట్ల షేర్ తో దుమ్మురేపగా ఎన్టీఆర్ క్రేజ్ ఉన్న పరాయి దేశం జపాన్ లోను 50 లక్షలవరకు షేర్ సాధించి అక్కడ కబాలి తర్వాత రెండో ప్లేస్ దక్కించుకున్న ఇండియన్ సినిమాగా నిలిచింది.

కాగా రీసెంట్ గా మాటివిలో టెలికాస్ట్ అయిన జనతాగ్యారేజ్ కి రికార్డు స్థాయిలో టి.ఆర్.పి వచ్చినట్లు చెబుతున్నారు. కాగా జపాన్ లోను సినిమాకి దిమ్మతిరిగే రేటింగ్ వచ్చిందట. అక్కడ డబ్ కాకున్నా మాటివి చానెల్ ని ఎలాగోలా ట్యూన్ చేసుకుని మరీ జనతాగ్యారేజ్ సినిమాను చూశారట.

రివ్యూ - ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా…

కాగా టి.ఆర్.పి ఎక్కడెక్కడ వచ్చిందో లెక్కేస్తున్న సమయంలో జపాన్ లోను భారీ లెవల్ గా సినిమాను తెలుగులోనే టివిలో చూడటం జరిగిందని కన్ఫాం చేశారు. టి.ఆర్.పి ఎంతో తెలియదు కానీ అక్కడ లెక్కల ప్రకారం ఇండియన్ సినిమాల్లో ఆల్ టైం టాప్ 5 లో ఒకటిగా నిలవడం మాత్రం ఖాయం అంటున్నారట.

కామెంట్‌లు