తెరపై సందడి చేయనున్న గీతామాధురి


చిత్రపరిశ్రమలోని గాయకులూ హీరోలుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి కాని, గాయనీలు హీరోయిన్లుగా మారిన సందర్భాలు చాలా తక్కవ. అయితే త్వరలో తెలుగు స్టార్ సింగర్ హీరోయిన్ గా మారనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హీరోయిన్స్ తో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న సింగర్ గీతామాధురి చిరుత సినిమాలో చమ్కా చమ్కా చమ్కీరే అంటూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు, ఆ తర్వాత వేనుతిరిగి చూసుకోలేదు.

మాస్, క్లాస్, మెలోడి పాటలతో లక్షలాది మంది అభిమానులని సొంతం చేసుకుంది. హస్కీ వాయిస్ గీతామాధురికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. గ్లామర్ పరంగా కూడా ఈమెకు హీరోయిన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. తాజాగా అదితి అనే షార్ట్ ఫిల్మ్ లో లీడ్ రోల్ చేసి, తనలోని నటన ప్రతిభ కూడా ఉన్నదని నిరూపించుకుంది. ఇదే ఆమెకు ఓ వెండితెర అవకాశాన్ని ఇచ్చిందని అన్నారు సినీజనం.

త్వరలో విడుదల కానున్న ఓ సినిమాలో గీతా మాధురి నటిస్తోందని టాక్ వినిపిస్తుంది. అయితే అది గెస్ట్ రోలా, లేక లీడ్ హీరోయిన్ గా నటిస్తుందా అనేది తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం పరిశ్రమలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఒక వేళ లీడ్ హీరోయిన్ గా చేస్తుంటే, ఇది ఈ అమ్మడికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. త్వరలోనే ఈ మూవీ గురించిన పూర్తి వివరాలు ప్రకటిస్తారని సమాచారం.


కామెంట్‌లు