దయ చేసి ఎన్టీఆర్ ని ఎవ్వరి తో కలిపి పోల్చోద్దు..


టాలీవుడ్ లో ఉన్నా అతి పెద్ద ఫ్యామిలి లో నందమూరి వంశం ఒక్కటి. ఆ వంశం లో ఇప్పుడు చీలీకలు ఎర్పడుతున్నట్లు గా కన్పిస్తున్నాయి. అయితే వాస్తవానికి ఆ చీలీకలు కూడా ఒక వైపు నుంచే అని అనాలి. ఎందుకంటే ఎవరు ఎన్ని అన్నా అసలు జనాల్లో కి ఆ వంశాన్ని తీసుకువచ్చింది తారక రామరావు గారు. దీనిని అందరు ఒప్పుకుంటారు కూడా. అయితే ఆ తరువాత తరం లో బాలకృష్ణ,హరికృష్ణ లు వచ్చినప్పటికి ఎక్కువ కాలం ఆ వంశం ఐకాన్ గా ప్రజల్లో మంచి గుర్తింపు పోందిన నటుడు బాలకృష్ణ ఇక్కడి వరకు బాగానే ఉంది.

మరి ఆ తరువాత తరం లో ఎవరు అని జనాలను అడిగితే మాత్రం తప్పకుండా 100 శాతం వినిపించే ఎకైక పేరు ఆ స్తతా 100 % ఉన్నోడు కేవలం జూనియర్ ఎన్టీఆరే. జూనియర్ అంటే ఎంటో ప్రతి ఒక్కరి తెలుసు.
నందమూరి తారకరామరావు పోలికలతో పాటు గా నటనలో, అలాగే వాక్యచాతుర్యం లో అలాగే ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో కూడా సినియర్ ఎన్టీఆర్ కి ఎ మాత్రం తీసిపోడు. పైగా ఎన్టీఆర్ ఇవన్నీ కూడా జనాలకి 25 ఎళ్ళ కే రుచి చూపించాడు కూడా. ఈ విషయం అందరు ఒప్పుకోవాల్సిందే అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన రాజకీయ ఉపన్యాస లకు ఆశ్చర్యపోని వారుండరు. జూనియర్ వాక్ దాటికి శభాష్ జూనియర్ అని అనని వారేవరు ఉండరు. జూనియర్ మహనాడు లో ఇచ్చిన స్పీచ్ మెత్తం దేశ రాజకీయాల్లో నే హైలెట్ అనడం లో ఎలాంటి సందేహం ఉండదు.

ఎవరు ఎమన్నా జనాల్లో నందమూరి వంశాన్ని అలాగే తెలుగుదేశం పార్టీ ని భవిష్యత్తులో మెయగలిగే సత్తా ఉన్నది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే. అది తారక్ రత్న,నారా రోహిత్ ,లోకేష్ వల్ల అసాధ్యం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న వాక్ ధాటి వారిలో సగం కూడా లేదు. అది కాకపోయినా జనాల్ని ఆకర్షించగలిగే సత్తా కూడా జూనియర్ ఎన్టీఆర్ లో సగం కూడా లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్నా ఫాలోయింగ్ లో వారికి 10 % కూడా ఉండదు.

పైగా ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ మెత్తం సౌత్ లో నే ఫేమస్ అవుతున్నాడు. ఇప్పుడు అతని దృష్టి మెత్తం సినిమా లపైనే కేంద్రీకరిస్తున్నాడు. అయితే ఈ మద్య చాలా చోట్ల తెలుగుదేశాన్ని మెసేదీ నారా రోహితా లేక పోతే జూనియరా అని చర్చలు వస్తున్నాయి. నారా రోహిత్ కి జూనియర్ కి ఉన్నా వాగ్ధాటి సగం కూడా లేదు.ఇది జగమేరిగినా సత్యం. రాజకీయాల్లో అలాగే ప్రజల్లో మెలగాలి అంటే వాగ్థాటి ఖచ్చితంగా అలాగే రాజకీయ చతురత ఖచ్చితంగా ఉండాల్సిందే.వాటిల్లో జూనియర్ కి తిరుగులేదు. జూనియర్ రాజకీయాల్లో స్పీచ్ ఇస్తుంటే మన దృష్టి ప్రక్కకు మళ్ళదు. అంతా బాగా ఆకట్టుకోగలడు. కానీ లోకేష్ కి ఆ సత్తా లేదు.

అందుకే చెప్పేది ఎన్టీఆర్ ఫాలోయింగ్, రాజకీయ చతురత, వాక్ ధాటి ఇవన్నీ కూడా నందమూరి వంశం లో జూనియర్ ఎన్టీఆర్ కి ఎప్పుడైనా సరే పట్టాం కడతాయి. కానీ దానికి కాస్తా సమయం పట్టవచ్చు.
అందుకే మేము గట్టీగా చెబుతున్నాం జూనియర్ ఎన్టీఆరే నందమూరి భవిష్యత్తు.

అది కాకపోయినా సినియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని చూసి వీడు నా ఆంశ రా అని చెప్పి తారక రామారావు అని పేరు పెట్టడట. అందుకే చెబుతున్నాం జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా సరే సినియర్ ఎన్టీఆర్ ని అలాగే నందమూరి వంశాన్ని చరిత్ర లో నిలబెడుతాడు అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కి జనాల్లో నందమూరి ఐకాన్ గా గుర్తింపు తో పాటు ముద్ర కూడా ఎప్పుడో పడింది .

అందుకే ఇప్పుడు తారక్ అభిమానులు దయ చేసి తారక్ ని ఎవ్వరి తో కలిపి పోల్చోద్దు అని అంటున్నారు. ఎందుకంటే తారక్ తాత కి తగ్గ మనవుడు..


కామెంట్‌లు