బాలయ్య సినిమా అనగానే అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడతాయి. పైగా ఇప్పుడు నటించేది వందో సినిమా. దర్శకుడు క్రిష్ జాతీయ అవార్డు అందుకున్న తర్వాత చేస్తున్న సినిమా అవడంతో కమర్షియల్ యాంగిల్ లో కూడా ఈ సినిమాకి మంచి పట్టు కనిపిస్తుంది. ఈ సినిమాకి ఓ మంచి ఎమోషనల్ యాంగిల్ ని క్రిష్ జోడించాడు అనే టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో క్రిష్ మార్క్ సీన్స్ ఉన్నాయని, హృదయాన్ని హత్తుకుపోయే సన్నివేశాలు బోలెడు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఒక్కసారి చూద్దాం.
-గౌతమీపుత్ర కథలోకి ప్రేక్షకుడిని క్రిష్ చాలా తెలివిగా ఇన్వాల్వ్ చేస్తాడు. రోమాలు నిక్కబోడుచుకునే రీతిలో కథ తాలుకూ గంబీరత్వం ఉంటుందని అంటున్నారు. బాలయ్య ని చూపించే ముందరే గౌతమి పుత్రా శాతకర్ణి వీరత్వాన్ని జనాలకి అర్ధమయ్యేలా కొన్ని సీన్స్ రాశాడు క్రిష్.
యుద్ద సన్నివేశాలు, వాటికోసం రచించే వ్యూహాలు మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం వాటిని చాలా కొత్తగా ప్రయత్నించాడు దర్శకుడు క్రిష్ అని టాక్ నడుస్తుంది. సైనికులుగా నటించిన వారంతా జార్జియా దేశాస్తులే. వాళ్ళ రూపు రేఖలు, పోరాట పటిమ ఈ సినిమాకి మరింత వెన్నె తెస్తుందని తెలుస్తుంది.
-హీరోయిన్ శ్రియని ఎదో నాకేం వస్తే పెట్టకుండా ఒక మంచి సబ్జెక్ట్ తో జోడించి సినిమాలోకి తీసుకున్నారట. ఆమె కీ బాలయ్య కీ మధ్యన భార్య గొప్పదనానికి సంబందించిన డైలాగ్స్ చాలా బాగా వచ్చాయని అంటున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో రానున్నాడు. అతని రాకతోనే సినిమా మంచి మలుపు తిరుగుతుంది అంటున్నారు.
- శాతకర్ణ జీవితం లో కీలక ఘట్టమైన యుద్ధానికి వెళుతూ వెళుతూ తన తల్లి , భార్య , సైన్యం గురించి బాలయ్య మాట్లాడే డైలాగులు సినిమాకే హై లైట్ కాబోతున్నాయి.
- ఒకానొక రోజు కోటలోకి శత్రువులు దొంగతనంగా ప్రవేశించి శాతకర్ణి ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దాదాపు పది మంది యుద్ధ వీరులు అతన్ని ఎదిరించాగా అతను వారి మీద పోరాడే సన్నివేసం చాలా బాగా వచ్చింది అంటున్నారు.
-క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమాకి ప్రాణం పోశాయి . తెలుగుజాతి, భారతీయ తత్వం, ఇక్కడి త్యాగ నిరతి, క్షమించే గుణం వీటి గురించిన సంభాషణలతో ఎమోషనల్ క్లైమాక్స్ ని డిజైన్ చేశాడట క్రిష్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి