యాంకర్ శ్యామల ఇలా రెచ్చిపోయిందేంటీ..!


ఈ మద్య వెండి తెర హీరోయిన్ల కంటే బుల్లితెరపై వస్తున్న యాంకర్ల హవా బాగా కొనసాగుతుంది. ఇప్పటికే తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడి షోతో పాపులర్ అయిన అనసూయ, రష్మీ తో పాటు పటాస్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది శ్రీముఖి. ఇక సాంప్రదాయంగా ఉంటూ సినిమా ఆడియో వేడుకల్లో తన సత్తా చాటుతుంది యాంకర్ సుమ. గతంలో యాంకర్లు ఎంతో మంచి వచ్చారు..కానీ ఇప్పటి యాంకర్స్ కి వచ్చిన పాపులారిటీ మాత్రం రాలేదు.


దీనికి కారణం ప్రస్తుతం యాంకర్ల తమ స్టైల్ మొత్తం మార్చారు..మోడల్స్ ని తలదన్నే డ్రెస్సింగ్..హాట్ హాట్ మాటలతో హావభావాలతో యువతకు కిక్కెస్తున్నారు. దీంతో తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకొని ఏకంగా సినిమా చాన్సులు కూడా కొట్టేస్తున్నారు.

ఇప్పటి వరకు బుల్లితెరపై చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ..అచ్చతెలుగు అమ్మాయిలా ఉండే శ్యామల..ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ అమ్మడు తన పుట్టిన రోజు పార్టీ గ్రాండ్ గా చేసుకోనప్పటికీ..ప్రస్తుతం తనకు వచ్చిన పాపులారిటీ మరింత పెంచుకునేందుకు తన సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చింది. అంతే కాదు ఆ పార్టీలో రెచ్చిపోయి హంగామా చేయడంతో అందరూ షాక్ అయ్యారట.

యాంకర్ గా మరింత ముందుకు వెళ్ళడమే కాకుండా అటు సినిమాల పరంగా ఇటు యాంకర్ గా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి దాంతో తన తలరాత మారిపోయిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది శ్యామల . అందుకే పార్టీలో రెచ్చిపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే మరి రెండు చేతులా సంపాదిస్తుంటే..సెలబ్రేషన్స్ అవే వస్తుంటాయి.

కామెంట్‌లు