టాప్ 1 పొజిషన్ లో ఎన్టీఆర్..!!


యంగ్ టైగర్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన రేంజ్ భీభత్సం సృష్టించి 13 ఏళ్ళు అయ్యింది. సింహాద్రి సమయంలో రచ్చ రచ్చ చేసిన ఎన్టీఆర్ తరువాత తన ప్రతీ కొత్త రిలీజ్ కి ఓపెనింగ్ డే రికార్డులతో సరిపెట్టిన ఎన్టీఆర్ మళ్ళీ ఇప్పుడు జనతాగ్యారేజ్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి 90కోట్ల మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతున్నాడు.

కాగా ఇదివరకు టాప్ 5 లో లేని యంగ్ టైగర్ ఒక్క మాసివ్ బ్లాక్ బస్టర్ తో ఏకంగా టాప్ 1 పొజిషన్ కి చేరుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్ అండ్ చరిష్మా దృశ్యా మహేష్-పవన్ లకు ఏమాత్రం తీసి పోనీ క్రేజ్ ఎన్టీఆర్ సొంతం…ఓ విధంగా చెప్పాలి అంటే ఓవర్సీస్ లో మహేష్ టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నాడు ఎన్టీఆర్.

ఇక కర్ణాటకలో ఎన్టీఆర్ కి తిరుగు లేకుండా పోయింది. ఇక పక్క రాష్ట్రం తమిళనాడులో మహేష్-అల్లుఅర్జున్ లు బైలింగువల్ సినిమాలు చేస్తుండటంతో ఎన్టీఆర్ కూడా ఆ విధంగా అడుగులు వేస్తున్నాడు. తెలుగు వర్షన్ తోనే అక్కడ రచ్చ చేశాడు ఎన్టీఆర్.

అలాంటి బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్ ఖాతాలో పడిoది.ఇక టాప్ చెయిర్ తనదే అంటున్నారు ట్రేడ్ పండితులు.