2016 ఇండియన్ సినిమాకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి…ఏ ఇండస్ట్రీని తీసుకున్నా సూపర్ డూపర్ హిట్లు కొడతాయి అనుకున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలపడగా కొన్ని అనుకోని హిట్స్ అదరగొట్టినా అవి భారీ విజయాలుగా మాత్రం మారలేకపోయాయి. అలాంటి ఇండియన్ సినిమాను కొన్ని సినిమాలు పరువు కోల్పోకుండా కాపాడాయి.
వాటిలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా టోటల్ గా వరల్డ్ వైడ్ గా 224 కోట్ల షేర్ వసూల్ చేసి టాప్ ప్లేస్ కొట్టేసింది. ఇక రెండో ప్లేస్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి…డిసాస్టర్ టాక్ తోనూ 170 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఇక మూడో ప్లేస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచి అందరికీ షాక్ ఇచ్చాడు.
Read More news Click here ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ లుక్ ఇదే..!
ఇంతకుముందు మూడో ప్లేస్ లో విజయ్ నటించిన తెరీ 78 కోట్లతో ఉన్నా ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ 86 కోట్ల చారిత్రిక మార్క్ అందుకోవడమే కాదు…2016 ఇండియన్ సినిమా హిస్టరీలోనే 3 డో బిగ్గెస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఇయర్ చెప్పుకోదగ్గ పెద్ద హీరోల సినిమాలు తక్కువగానే ఉండటంతో జనతాగ్యారేజ్ టాప్ 3 లో ప్లేస్ నిలుపుకోవడం గ్యారెంటీ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి