ఎన్టీఆర్ తాజా గా జనతా గ్యారేజ్ సినిమా తో హిట్ సాధించి సౌత్ లోని అన్ని ఇండస్ట్రీ ల దగ్గర నుండి మన్నలను అందుకున్నాడు. దాంతో పాటు తారక్ అభిమాను లు కూడా ఫుల్ ఖుషీ గా ఉన్నారు. అలాగే వారు నాన్న కు ప్రేమ తో సినిమా 50 వ రోజు నా ఎలాగైతే కేక్స్ కట్ చేసి ఎంజాయ్ చేశారో. మళ్ళీ అదేవిదంగా జనతా గ్యారేజ్ సినిమా కి కూడా ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు.
కానీ ఇంతలోనే మా టీవీ వారు ఈ సినిమా బుల్లి తెర పై కమింగ్ సూన్ అని వేసింది. ఇది చూసిన నిజమైన అభిమానులకి ఇది అస్సలు నచ్చట్లేదు. ఈ సినిమా వచ్చి సంవత్సరం కూడా కాలేదు. కనీసం ఇంకా 50 రోజులు కూడా పూర్తి చేసుకోలేదు అప్పుడే ఈ సినిమా ని టీవీ లో ప్రదర్శించడం ఎంటీ అని కోందరు తారక్ అభిమానులు సోషల్ మీడియా సాక్షి గా మండిపడుతున్నారు.
అందుకే సోషల్ మీడియా లో ఇప్పుడు చాలా మంది RIP Maa Tv అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ సంవత్సరం నాన్న కు ప్రేమ తో సినిమా ని tv9 టాప్ 9 సాంగ్స్ లో ప్రకటించకపోయే సారికి సోషల్ మీడియా లో RIP Tv9 అని పోస్ట్ పోస్ట్ ల మీద పోస్ట్ పెట్టారు. ఆ తరువాత టీవీ 9 లో ఎన్టీఆర్ స్టామినా గురించి ఒక స్పెషల్ కార్యక్రమం వేశారు.
ఇంకా కోందరు అయితే చాలా ముందుకు వెళ్ళీ ఇది అల్లు అరవింద్ గారి ఆలోచనే అని అతని పై మండిపడుతున్నారు.
ఎదీ ఎమైనా ఈ సినిమా ని సంక్రాంతి సమయం వరకు వేస్తే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇది మంచి మేసెజ్ ఒరియంటెండ్ సినిమా టీవీ ఇప్పటికి ఎప్పటికి క్రేజ్
ఉంటుంది. టీవీ లో ఇప్పటికి టెంపర్ సినిమా రేటింగ్ తగ్గట్లేదు. అందుకే ఈ సినిమా ని కూడా కోంతకాలం తరువాత వేయాలి అని కోరుకుద్దాం.
