'ఇజం'లో పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ

'ఇజం' సినిమాను మొదట్నుంచి మంచి యాక్షన్ థ్రిల్లర్ లాగే ప్రొజెక్ట్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్. ప్రధానంగా ఈ సినిమా పూరి మార్కు హీరోయిజం మీదే నడిచేలాగా కనిపించింది. ఇక పూరి స్టయిల్లో హీరోయిన్ టీజింగులు అవీ ఉంటాయని కూడా ట్రైలర్లో కట్ చేసిన కొన్ని సీన్లు.. పాటల్లోని దృశ్యాల్ని బట్టి అర్థమైంది. ఐతే 'ఇజం'లో పూరి గత సినిమాలకు భిన్నంగా పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంటుందని అంటున్నాడు కళ్యాణ్ రామ్. సినిమా ద్వితీయార్ధమంతా యాక్షన్ మోడ్లోనే ఉంటుందని.. ఐతే ప్రథమార్ధంలో ఒక క్యూట్ అండ్ పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ పెట్టామని కళ్యాణ్ రామ్ చెబుతున్నాడు.
'ఇజం' సినిమాకు సంబంధించి లేటెస్ట్గా వదిలిన రిలీజ్ డేట్ ప్రోమో కూడా కళ్యాణ్ రామ్ మాటలకు తగ్గట్లే ఉంది. అందులో హీరోయిన్ బురఖా వేసుకుని.. గన్ను పట్టుకుని ఎక్కడెక్కడో తిరిగిస్తోంది. చాలా దీనంగా కనిపిస్తోంది. మరి లవ్ స్టోరీలు డీల్ చేయడంలో అంతగా పట్టులేని పూరి.. 'ఇజం'లో ఈ క్యూట్ అండ్ పెయిన్ ఫుల్ లవ్ స్టోరీని ఎలా చూపించాడో చూడాలి. కళ్యాణ్ రామ్ సరసన మాజీ మిస్ ఇండియా అదితి ఆర్య నటిస్తోంది. ఆమెకిదే తొలి తెలుగు చిత్రం. కళ్యాణ్ రామే స్వయంగా నిర్మించిన 'ఇజం' బ్లాక్ మనీ గుట్టు రట్టు చేసే కథాంశంతో సాగుతుంది. నందమూరి హీరో జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నాడు. జగపతి బాబు కీలక పాత్ర పోషించాడు. ఈ శుక్రవారమే 'ఇజం' ప్రేక్షకుల ముందుకు రానుంది.

కామెంట్‌లు