ప్రేమమ్ సెన్సార్ రిపోర్ట్..!!



నాగ‌చైత‌న్య కొత్త సినిమా ప్రేమ‌మ్‌. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రుతిహాసన్‌, మడొన్నా సెబాస్టియన్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్స్. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది.

ఇటీవల విడుదల చేసిన ట్రయిలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.మలయాళం సూపర్ హిట్ ప్రేమ‌మ్‌ కు రిమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. మలయాళం సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది.

అన్నట్టు.. ఈ చిత్రంలో హీరో వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారు. అలాగే నాగార్జున ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. నాగార్జున వాయిస్ ఓవర్ తోనే ఈ సినిమాలో పాత్రలు పరిచయం అవుతాయని సమాచారం. అక్టోబర్ 7 ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.