మహేష్ బాబుపై విమర్శలు!!



తెలుగు సినిమా "సూపర్ స్టార్" అనే బిరుదు ఉన్న, మహేష్ బాబుకి తెలుగు చదవడం, రాయడం రాదు అన్న సంగతి తెలిసిందే. దానికి కారణం లేకపోలేదు. మహేష్ బాబు పుట్టింది చెన్నైలో. స్కూలు నుంచి హీరోగా మారేదాకా, చదువంత చెన్నైలోనే కొనసాగించాడు. తెలుగు ఎవరు నేర్పకపోవడంతో మహేష్ కి తెలుగు రాయడం గాని, చదవడం కాని రాదు. కాని మాట్లాడటం వచ్చు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటారా!

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ టాపిక్ మీదే పవన్ - మహేష్ ఫ్యాన్స్ దెబ్బలాడుకుంటున్నారు. విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ తన రెండొవ పుస్తకం "నేను-మనం-జనం" త్వరలోనే విడుదల చేయనున్న సంగతి తెలిసిందే కదా. పవన్ కళ్యాణ్ కి తెలుగు భాషపై పట్టు ఉందని, అందుకే పుస్తకాలు రాయగలుగుతున్నాడని, మరోపక్క తెలుగువాడిగా పుట్టి, తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగు ప్రేక్షకుల అభిమానంతో ఎదిగిన మహేష్ కి తెలుగు రాయటం, చదవటం రాకపోవడం అవమానకరం అని పవన్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. గ్యాప్ ఇవ్వకుండా మహేష్ పై పెద్దగానే విమర్శలు చేస్తున్నారు.

చెన్నైలో పుట్టిపెరిగిన వాడికి తెలుగు రాయడం, చదవడం ఎలా వస్తుందని మహేష్ అభిమానులు డిఫెన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క జనతా గ్యారేజ్ సక్సెస్ తో ఊపు మీద ఉన్న ఎన్టీఆర్ అభిమానులు జరుగుతున్నదంతా చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.