దట్ ఈజ్ ఎన్టీఆర్ స్టామినా..హిందీలో దుమ్ములేపిన గ్యారేజ్



ఈ మధ్య కాలంలో జనతా గ్యారేజ్ సినిమాకు కలిసొచ్చినంతగా ఇంకే సినిమాకూ జరగలేదేమో. ఎన్టీఆర్ హార్డ్ వర్క్‌కి అదృష్టం కూడా ఓ రేంజ్‌లో తోడవుతోంది. గ్యారేజ్‌తో అసోసియేట్ అయిన వాళ్ళందరికీ కూడా లాభాల పంట పండిస్తోంది. కొరటాల శివ తప్పులను కూడా కవర్ చేసేంతే రేంజ్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్సులు ఉండడం గ్యారేజ్‌కి చాలా చాలా కలిసొచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఏ పెద్ద హీరో సినిమాకీ జరగనట్టుగా 15 కోట్ల రూపాయల పైన లాభాలను పంచుకున్న ప్రొడ్యూసర్స్‌కి ఇఫ్పుడు ఇంకో బంపర్ ఆఫర్ కూడా తగిలింది.

ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా హిందీలో డబ్ చేసి టివిలలో టెలికాస్ట్ చేసినప్పుడు అదిరిపోయే రేటింగ్స్ తెచ్చుకుంటాయన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాలు కూడా హిందీ శాటిలైట్ ఛానల్స్‌లో, యూట్యూబ్‌లో చాలా బాగా ఆడేశాయి. ఇప్పుడిక జనతా గ్యారేజ్ లాంటి కంటెంట్ ఉన్న సినిమా ఏ రేంజ్‌లో ఆడుతుంది? రిలీజ్‌కి బిఫోర్ ఆరు కోట్ల వరకూ పలికిన జనతా హిందీ శాటిలైట్ రైట్స్ ఇప్పుడు ఏకంగా 9 కోట్ల వరకూ అమ్ముడుపోయాయట. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇదే బిగ్గెస్ట్ ప్రైస్. అలాగే చాలా మంది తెలుగు హీరోలు ఈ అమౌంట్‌కి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆల్రెడీ టెంపర్ సినిమా హిందీ చానల్స్‌లో, యుూట్యూబ్‌లో దుమ్ము దులిపేసింది. ఇప్పుడిక జనతా గ్యారేజ్ సృష్టించబోయే సంచలనం ఏ రేంజ్‌లో ఉండబోతోందో చూడాలి మరి.