బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ కి మరో మంచి రోజులా సాగింది జనతాగ్యారేజ్ 21 వ రోజు కలెక్షన్స్….వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను భారీగా కురిసినా జనతాగ్యారేజ్ కలెక్షన్స్ మాత్రం స్టడీగానే సాగాయి…మరీ లాస్ట్ రెండు రోజుల్లో వచ్చినట్లు కలెక్షన్స్ రాకున్నా ఓవరాల్ గా మాత్రం సాటిస్ఫాక్షన్ కలెక్షన్స్ తో రోజుని ముగించింది జనతాగ్యారేజ్.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంమీద 41 లక్షల షేర్ వసూల్ చేసిన జనతాగ్యారేజ్…మిగిలిన ఏరియాల్లో 6 లక్షల షేర్ దాకా వసూల్ చేసినట్లు అంచనా…చారిత్రిక 80 కోట్ల మార్క్ ని ఈ కలెక్షన్స్ తో క్రాస్ అయిన జనతాగ్యారేజ్ జోరు 85 కోట్లు అందుకునేదాకా ఆగేలా లేదు అంటున్నారు ట్రేడ్ పండితులు.
నైజాంలో తొలిసారిగా ఫుల్ కమాండింగ్ పొజిషన్ లో ఉన్న ఎన్టీఆర్ కి జనతాగ్యారేజ్ క్రేజ్ పెంచుకునే అద్బుతమైన అవకాశాన్ని ఇచ్చింది..దాంతో అక్కడ 20 కోట్లు అందుకోవడం పెద్ద కష్టం కాదు అంటున్నారు ఇప్పుడు. ఇక సీడెడ్ లో ఎలాగూ టాప్ 3 ప్లేస్ కొట్టేసిన ఎన్టీఆర్ మగధీరని బీట్ చేసి టాప్ 2 కి రావాలి అని ఆశ పడుతున్నాడు. మరి చూడాలి ఏం జరుగుతుందో.
