ఎన్టీఆర్ కోసం నాలుగు కథలు



‘జనతా గ్యారేజ్‌’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు తారక్. ఈ సినిమా తర్వాత కొంతకాలం విరామం తీసుకొంటానని చెప్పినా.. ఆ బ్రేక్ సమయాన్ని కొత్త కథల్ని వినడం కోసం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకులు ఎన్టీఆర్ వద్దకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దగ్గరకు నాలుగు కధలు, నలుగురు దర్శకులు చేరారు. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడని ప్రచారం సాగినా అది ఇంకా ఫైనల్ కాలేదు.

అలాగే అనిల్‌ రావిపూడి చెప్పిన ఓ కథని కూడా విన్నారు ఎన్టీఆర్‌. మరోపక్క పూరి జగన్నాథ్‌ ఎన్టీఆర్‌ కోసం ఎప్పుడో కథని సిద్ధం చేసి పెట్టుకొన్నారు. తాజాగా దర్శకుడు లింగుస్వామి కూడా కథ వినిపించాడు. ఈ నాలుగు కధలను విన్నారు ఎన్టీఆర్. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఫ్యామిలీ తో కలసి ఫారిన్ టూర్ వెళతారు తారక్. అటు నుంచి వచ్చిన తర్వాత కొత్త సినిమా కబురు చెప్పే అవకాశం వుంది.