యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ విడుదల అయ్యి 20 రోజులు పూర్తి చేసుకుంది…బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ తో 82కోట్లకు చేరువ అవుతున్న జనతాగ్యారేజ్ మూడో వర్కింగ్ డేస్ లోను ఎలాంటి డ్రాప్స్ లేకుండా కలెక్షన్స్ సాగుతున్నాయి.
వైజాగ్ లో సినిమాకి పోటి లేకుండా పోయింది. వైజాగ్ మొత్తంమీద నిన్న దాదాపు 65% ఆక్యూపెన్సీ ఉన్నట్లు లెక్కేస్తున్నారు. ఇక సీడెడ్ లో మగధీర కలెక్షన్స్ ని దాటడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎన్టీఆర్ ఆ మార్క్ కి మరో 2 కోట్ల దూరంలో ఉన్నాడు.
మొత్తంమీద 20 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల షేర్ వసూల్ చేసిన జనతాగ్యారేజ్ టోటల్ వరల్డ్ వైడ్ గా 80.56 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే శ్రీమంతుడు టోటల్ రన్ షేర్ 87 కోట్లను దాటేయడం పెద్ద కష్టం కాదు అంటున్నారు.
