వెంకీ ‘గురు’ ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా ?



‘బాబు బంగారం’తో సందడి చేసిన వెంకటేష్ ఇప్పుడు బాక్సర్ గా కనిపించాబోతున్నారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘సాలా ఖదూస్‌’రీమేక్‌లో వెంకటేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ బాక్సింగ్ కోచ్‌ స్టోరీ ఇది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరనీ ఫ్యాక్టరీ నుండి వచ్చినీ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో బాక్సర్ కోచ్ గా కనిపించబోతున్నారు వెంకీ.

ఈ చిత్రానికి ‘గురు’అనే పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఖరారైయింది. శనివారం సాయంత్రం ‘గురు’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు టీం ప్రకటించింది.

ఈ సినిమాకి ఒరిజనల్ వెర్షన్ ని తెరకెక్కించిన సుధా ప్రసాదే దర్శకత్వంవహిస్తారు. అలాగే హీరోయిన్ గా కూడా రితికసింగ్ నే ఎంపిక చేశారు.