పూరీ జగన్నాథ్ – కళ్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇజం’. ఇందులో ఎన్టీఆర్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడనే ప్రచారం జరిగింది. త్వరలోనే తారక్ పై సీన్స్ చిత్రీకరిస్తారని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తారక్ ‘ఇజం’లో గెస్ట్ రోల్ లో మెరిసేందుకు తిరస్కరించినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. పూరి, కళ్యాణ్ ఎంత కన్విన్స్ చేసినా తారక్ వినలేదట.
ఇద్దరం కలిసి నటిస్తున్నప్పుడు సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలుంటాయని.. వాటికి తగ్గ కథలో నటిస్తే బాగుంటుంది. కానీ, చిన్న రోల్‌లో చేస్తే సినిమాకు ఏం ఉపయోగం ఉండదని తారక్ పూరి, కళ్యాణ్ లని కన్విన్స్ చేసినట్టు తెలుస్తోంది. తారక్ చెప్పింది కూడా నిజమేనని కళ్యాణ్ కామ్ అయిపోయినట్టు తెలుస్తోంది. కాకపోతే, ‘ఇజం’లో తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడంట. ఇక, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కలసి నటించే చిత్రం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరైన కథ దొరికితే.. ఈ నందమూరి మల్టీస్టారర్ పట్టాలెక్క అవకాశాలున్నాయ్. మరి.. నందమూరి మల్టీస్టారర్ ని తయారు చేసే దర్శకుడు ఎవరన్నది చూడాలి.
దీంతో సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ మాత్రమే తీసుకున్నారని చెబుతున్నారు.