మాట్లాడడం అనే కళలో ఎన్టీఆర్ ఎప్పుడో మాస్టర్ డిగ్రీ చేసేసినట్టు ఉన్నాడు. ఇప్పటి వరకూ సిినిమాల్లోనే ఎన్టీఆర్ డైలాగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చూశాం. 2009లో పొలిటికల్ తెరపై దుమ్ము రేపిన ఎన్టీఆర్‌ని కూడా చూసేశాం అనుకోండి. ఇప్పుడు ట్విట్టర్‌లో మాత్రం అంతకుమించి అనే రేంజ్‌లో అదరగొట్టాడు ఎన్టీఆర్. ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 15 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురష్కరించుకుని రాజమౌళి పైన ప్రశంశల వర్షం కురిపించాడు ఎన్టీఆర్. అయితే జక్కన్న ప్రశంశించడం కోసం ఎన్టీఆర్ ఫ్రేం చేసిన పదాలు, వాటి పొందిక మాత్రం అదిరిపోయింది. ఎన్టీఆర్‌లో ఈ రేంజ్ రైటర్ ఉన్నాడా అని అనిపించేలా ఉంది. ఓ సందర్భంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడిన సుకుమార్ సినిమాల విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ చాలా క్లాస్ పర్సన్ అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ట్వీట్లను స్టడీ చేస్తే ఆ విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతోంది. జక్కన్నను ప్రశంశిస్తూనే చిన్న సెంటిమెంట్ టచ్‌ని కూడా ఇచ్చిన విధానం అయితే చాలా మందిని ఇంప్రెస్ చేస్తోంది.
15 లాంగ్ ఇయర్స్ః మొదటి సినిమా డైరెక్టర్ స్థాయి నుంచి భారతదేశం గర్వించదగ్గ స్థాయికి జక్కన్న ఎదిగిన వైనం అద్భుతమనే రేంజ్‌లో చెప్పాడు ఎన్టీఆర్.
15లాంగ్ ఇయర్స్ః బట్ ఇప్పటికీ అలాగే ఉన్న ఒక విషయం ఏంటంటే స్టూడెంట్ నంబర్ 1తో స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్.
15 లాంగ్ ఇయర్స్ః 19 సంవత్సరాల టీనేజర్ స్థాయి నుంచి ఈ రోజు తండ్రి స్థానానికి ఎదిగిన వైనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని మాంచి సెంటిమెంట్ టచ్ కూడా ఇచ్చాడు ఎన్టీఆర్.
ఈ ట్వీట్స్‌లో జక్కన్న ప్రశంశించిన వైనం, ఆ తర్వాత ఫ్రెండ్షిప్‌ని గుర్తు చేసుకున్న విదానంతో పాటు తాను టీనేజర్ నుంచి తండ్రిగా ఎదగడాన్ని ఎన్టీఆర్ ప్రస్తావించిన విధానం చూస్తుంటే ఎన్టీఆర్‌లో ఏ రేంజ్ రైటర్ ఉన్నాడో అర్థం కావడం లేదు. బిగుసుకుపోయి ఉండాలి, నా ఇమేజ్ మెయింటైన్ చేయాలి లాంటి శషభిషలు ఏమీ లేకుండా చాలా ఓపెన్‌గా, ఎక్స్‌ప్రెసివ్‌గా, ఎమోషనల్‌గా ఉన్న విధానం అయితే అందరూ అభినందించాల్సిందే. ఎమోషన్స్‌కి, బంధాలు, స్నేహం, అభిమానానికి ఎన్టీఆర్ ఇచ్చే గౌరవం నుంచి కూడా చాలా మంది చాలా నేర్చుకోవాలి.
