యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఓ రెండేళ్ళ క్రితం ఒక్క హిట్ పడితే చాలు అన్న ఆశలతో ఉన్న వాళ్లకి వరుసగా మూడు హిట్లు ఇచ్చి ఎన్టీఆర్ ఓ రేంజ్ లో బూస్టప్ ఇచ్చాడు. టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలతో పూర్తిగా ఒకదానికోటి సంబంధం లేని స్టొరీలతో రెచ్చిపోయాడు యంగ్ టైగర్.
కాగా పూర్తి మాస్ మూవీ చేస్తున్నాడు అనుకున్న జనతాగ్యారేజ్ కూడా మరో ప్రయోగాత్మక సినిమాగానే మిగిలింది. అయినా కూడా ప్రేక్షకులను అలరించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకోవడమే ఆడియన్స్ లోను భారీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది జనతాగ్యారేజ్.
సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండి జనతాగ్యారేజ్ అనే పేరు ఎంత పాపులర్ అయిందంటే మెకానిక్ షెడ్స్ నుండి వినాయక విగ్రహాలు, కొన్ని కాలనీలు ఇలా అన్ని చోట్లా జనతాగ్యారేజ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. లేటెస్ట్ గా హోటల్స్ కి ఫుట్ ఫాత్ షోరూమ్లకు కూడా జనతాగ్యారేజ్ పేరు వచ్చేలా పెట్టుకుంటున్నారు.

