మెగా హీరోల బెండు తీసిన ఎన్టీఆర్..!!



యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి తరువాత ఆ రేంజ్ హిట్ కోసం దాదాపు 13 ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సింహాద్రి రేంజ్ లో సగం కూడా అందుకునే విజయం ఎన్టీఆర్ సొంతం కాలేదు..ఈ గ్యాప్ లో టాలీవుడ్ టాప్ హీరోలు అందరు తమ సత్తా చాటుకున్నారు.


ఆల్ టైం టాప్ 5 లో ముఖ్యంగా మెగా హీరోలు నటించిన మూడు సినిమాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు ఫామ్ లో లేని యంగ్ టైగర్ నటించిన లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ తో తిరిగి ఫామ్ అందుకుని తన రేంజ్ ఏంటో చూపించాడు. కేవలం 15 రోజుల్లోనే ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ని దక్కించుకున్నాడు.

ఈ క్రమంలో మగధీర 73.80 కోట్లు, అత్తారింటికి దారేది 74.60 కోట్లు, సరైనోడు 74.80 కోట్ల రికార్డులను బ్రేక్ చేసి 75 కోట్ల మార్క్ ని అందుకుని బాహుబలి 194 కోట్లు, శ్రీమంతుడు 87 కోట్ల తరువాత ప్లేస్ ని దక్కించుకున్నాడు. దాంతో ఎన్టీఆర్ ఫామ్ లో ఉంటే ఇలాంటి రికార్డులు వస్తాయని చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్.