మహేష్ రికార్డ్‌ని బద్దలుకొట్టిన ఎన్టీఆర్


యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ ద్వారా సంచలనాలే సృష్టిస్తున్నాడు. స్టార్ హీరోలు తమ ఖాతాలో లిఖించుకున్న అరుదైన రికార్డుల్ని ఒక్కొక్కటిగా బద్దలుకొడుతూ వస్తున్నాడు. అందులో ఎక్కువగా.. మహేష్‌కి సంబంధించిన రికార్డులే బద్దలయ్యాయి. ఇప్పటికే ‘బాహుబలి’ తర్వాత అతి తక్కువ రోజుల్లో రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిన ‘శ్రీమంతుడు’ రికార్డ్‌ని కేవలం మూడురోజుల్లోనే ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. అలాగే.. అత్యంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో.. ఈ సునామీ ముందు ఇదివరకు ‘శ్రీమంతుడు’తో మహేష్ క్రియేట్ చేసిన రికార్డ్‌ని కొట్టుకుపోయింది. ఇక ఓవర్సీస్‌లోనూ మహేష్‌కి సాధ్యంకాని ఓ రికార్డ్‌ని క్రియేట్ చేశాడు ఎన్టీఆర్. ఇప్పుడు తాజాగా ప్రిన్స్‌కి సంబంధించిన మరో రికార్డ్‌ని యంగ్‌టైగర్ బద్దలుకొట్టాడు.

Read In English : “JANATHA GARAGE” BREAKS ANOTHER RECORD
మహేష్‌కి సాధ్యం కాని ఓ రికార్డ్‌ని ఎన్టీఆర్ క్రియేట్ చేశాడు. ‘గ్యారేజ్’ సినిమా ప్రీమియర్స్ ద్వారా $560K కలెక్ట్ చేసింది. ఈ దెబ్బకు.. మహేష్ ‘బ్రహ్మోత్సవం’ $556 కలెక్ట్ చేసిన రికార్డ్ అడ్రస్ లేకుండా పోయింది. రీసెంట్‌గా మరో రికార్డ్‌ని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. మహేష్, వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఓవర్సీస్‌లో టోటల్ రన్‌టైంలో $ 1,635,300 (10. 95 కోట్లు) కలెక్ట్ చేసింది. ఆరోజుల్లో అంతమొత్తం రావడం విశేషం. అయితే.. ఆ తర్వాత ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’తోపాటు ఇతర సినిమాలు భారీ వసూళ్లు రాబట్టి ఆ చిత్రాన్ని వెనక్కి నెట్టేశాయి. ఇప్పుడు ‘గ్యారేజ్’ ద్వారా ఎన్టీఆర్ ఆ మూవీ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. ఓవర్సీస్ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ‘జనతా గ్యారేజ్’ ఇప్పటివరకు $ 1,800,000 (12 .06 కోట్లు) కలెక్ట్ చేసింది. దీంతో.. ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో ‘గ్యారేజ్’ ఆరవ స్థానంలో నిలిచింది.