టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం లో కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ నయనతార నటిస్తుందని వార్త ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళ్తే .. బ్రహ్మోత్సవం చిత్రం తో భారీ ప్లాప్ చూసిన మహేష్ బాబు , మురుగదాస్ తో చేస్తున్న చిత్రం ఫై భారీగా నమ్మకం పెట్టుకున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై లో జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ లో నయనతార నటిస్తుందని వార్త , సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే ఈ పాత్రకు నయనతార అయితేనే బాగుంటుందని దర్శకుడు మురుగదాస్ ఆమెను ఎంపిక చేసాడని ప్రచారం జరుగుతుంది. కాకపోతే చిత్ర యూనిట్ నుండి ఈ వార్త ఫై ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. ఒకవేళ ఇదే నిజమైతే సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.
ఇక ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుండగా మహేష్ సరసన రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది.
