మహేష్- త్రివిక్రమ్ లది క్రేజీ కాంబినేషన్. అతడు .. ఖలేజా .. లాంటి క్రేజీ సినిమాలు వచ్చాయి వీరి కలయికలో. ఇప్పుడు మూడో సినిమా కూడా సిద్దం కానుంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే దీనికి ఇంకా సమయం పడుతుంది. అయితే ఈలోగా త్రివిక్రమ్- మహేష్ కలసి ఓ షూటింగ్ లో పాల్గొంటారు. ఇది ఓ అడ్వర్టైజ్మెంట్ షూటింగ్.
ఇటివలే ఓ ఆన్ లైన్ టికెటింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు మహేష్ బాబు. వాళ్ల కోసం ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఆ యాడ్ కోసం త్రివిక్రమ్ పేరు సూచించాడు మహేష్. ఇదివరకు కూడా మహేష్ చేసిన చాలా యాడ్స్ ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మరోసారి వీరిద్దరు జతకట్టారు. అక్టోబర్ మొదటి వారంలో ఈ యాడ్ షూటింగ్ వుంటుంది.
Read In English :Prabhas Focusing on Bollywood
ప్రస్తుతం మహేష్ , మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కధానాయిక. హారిష్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి టాప్ సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ ఠాగూర్ పనిచేస్తున్నారు. చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
