చైతు కళ్యాణం ఈమెతో కాదు



సాహ‌సం స్వాస‌గా సాగిపో, ప్రేమ‌మ్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు నాగచైత‌న్య‌. ఈ సినిమా తర్వాత సోగ్గాడే చిన్నినాయ‌న ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ తో ఈ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘కళ్యాణం’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రంలో కధానాయికగా ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు.

అయితే లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. ఇందులో వాస్తవమ లేదు. దీనిపై క్లారిటీ ఇచ్చింది లావణ్య. ”కళ్యాణ్ కృష్ణ- చైతు సినిమాలో నేను లేను’. అయితే కళ్యాణ్ సార్ డైరెక్షన్ లో ఇంకో సినిమా చేయాలని వుంది” అని ట్వీట్ చేసింది లావణ్య. కళ్యాణ్ దర్శకత్వం వహించిన సోగ్గాడే చిన్నినాయ‌నలో లావణ్య హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.

ఇక చైతు సినిమా విషయానికి వస్తే.. నాగార్జున కెరీర్‌లో ఓ సూప‌ర్ హిట్ చిత్రం… నిన్నే పెళ్లాడ‌తా. కుటుంబ బంధాల్ని కృష్ణ‌వంశీ ఎంత గొప్ప‌గా ఆవిష్క‌రిస్తాడో ఈ సినిమాతో అర్థ‌మైంది. ఇప్పుడు ఇదే తరహాలో నాగ చైతన్య- కళ్యాణ్ కృష్ణ సినిమా వుండబోతుందని తెలుస్తోంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.