నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం బాలయ్య సరసన శ్రియ జతకట్టనుంది. తాజాగా, మధ్య ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి చేసున్న చిత్రబృందం హైదరాబాద్ చేరుకొంది. అయితే, బాలయ్య హైదరాబాద్ చేరుకోగానే ప్రజా ప్రతినిథిగా ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తాజా వర్షాలపై ఆరా తీశారు. వ రద బాధితులకి తమ వంతుగా సహాయం అందించాలని అభిమానులకి పులుపునిచ్చారు. ‘ప్రియమైన అభిమానులారా.. మనం అంతా ఏకమై హైదరాబాద్, గుంటూరు ఇతర ప్రాంతాల్లో ఉన్న వర్ష బాధితులను ఆదుకోవాలని’ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు బాలయ్య. మరి.. బాలయ్య పిలుపుతో నందమూరి అభిమానులు ఏ మేరకు వరద బాదితులని ఆదుకుంటారన్నది చూడాలి.
ఇక, బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కీలక సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది. మిగితా భాగాన్ని కూడా వేగంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులనీ మొదలెట్టేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. అన్నట్టు.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపు దసరా కానుకగా శాతకర్ణి టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.