మూడో వారంలో జనతాగ్యారేజ్ టార్గెట్ ఇదే!!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ ఎన్టీఆర్ 13 ఎల్లా కలని నిజం చేస్తూ జనతాగ్యారేజ్ ఇండస్ట్రీలో చాలా రికార్డులను తాన ఖాతాలో వేసుకుంది. కాగా తొలి వారంలో 65 కోట్ల షేర్ ని వసూల్ చేసిన జనతాగ్యారేజ్ రెండో వారంలో మరో 10 కోట్లు వసూల్ చేసి 75 కోట్ల మార్క్ ని అందుకుంది.

ఇక మూడో వారంలో అడుగుపెట్టిన జనతాగ్యారేజ్ నయా టార్గెట్ ని ఫిక్స్ అయ్యింది. ఈ టోటల్ మూడో వారంలో జనతాగ్యారేజ్ 10 కోట్లవరకు కలెక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. కొత్త సినిమాలు కూడా పెద్దగా లేకపోవడంతో ప్రేక్షకుల మొదటి చాయిస్ జనతాగ్యారేజ్ మాత్రమే.

దాంతో ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదు అంటున్నారు. జనతాగ్యారేజ్ కనుక ఈ మార్క్ ని అందుకుంటే మొత్తంగా 85 కోట్లకు చేరుకుంది. ఇక మిగిలిన రన్ లో ఎన్ని వస్తే శ్రీమంతుడు 87 కోట్లకు అంత చేరువ అవుతుంది. మరి జనతాగ్యారేజ్ ఎంతదూరం వెళుతుందో చూడాలి.