మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు, ఆది-సింహాద్రి లాంటి మాస్ సినిమాలతో చిన్న ఏజ్ లోనే సూపర్ స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తరువాత ఆ రేంజ్ హిట్స్ కోసం చాలాకాలమే ఆగాడు. కాగా ఇన్నాళ్ళు ఆగిన ఎన్టీఆర్ కి ఇప్పుడు టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలతో రెండు మంచి హిట్స్ కొట్టడమే కాకుండా తన క్రేజ్ ని కూడా పెంచుకున్నాడు.
కాగా ఇప్పుడు తన కెరీర్ ని మలుపుతిప్పే సినిమాను చేయబోతున్నాడు. మిర్చి-శ్రీమంతుడు సినిమాలతో ప్రభాస్-మహేష్ లకు కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న “జనతాగ్యారేజ్” సినిమాతో తన మార్కెట్ ని డబుల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. తెలుగుతో పాటు మలయాళంలోనూ ఈ సినిమా రూపొందుతుండటంతో ఆ ఛాన్స్ ఎక్కువగా ఉంది. సెప్టెంబర్ 2 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ మొత్తం మారిపోబోతుంది.
ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం స్క్రిప్ట్ సూపర్ గా కుదిరింది అని ఎన్టీఆర్ కి సింహాద్రి రేంజ్ మాస్ హిట్ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే కర్ణాటక-ఓవర్సీస్ లో బాద్ షా అనిపించుకుంటున్న ఎన్టీఆర్ ఈ సినిమా హిట్ అయితే ఎన్టీఆర్ కి కేరళలో కూడా మార్కెట్ పెరగడం ఖాయం అని అంటున్నారు.
ఇక హిందీలోను ఈ సినిమా డబ్ అవ్వబోతుంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమ౦టున్నారు. ఎలాగు అంతటా పాజిటివ్ బజ్ నడుస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి అంటే సెప్టెంబర్ 2 వరకు ఆగాల్సిందే.
