![]() |
| NTR Creates Record in UAE |
‘జనతా గ్యారేజ్’ సినిమా మీద ఏ రేంజులో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కేరళతోపాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే.. మూవీ మేకర్స్ ‘గ్యారేజ్’ని చాలా లొకేషన్స్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా.. యూఏఈలో ఈ చిత్రాన్ని ఏకంగా 48 లొకేషన్స్‌లో విడుదల చేస్తున్నారు. ఇది నిజంగా సంచలనమే. ఎందుకంటే.. గల్ఫ్ కంట్రీలో ఏ ఒక్క తెలుగు సినిమా అన్ని లొకేషన్లలో రిలీజ్ కాలేదు. ‘బాహుబలి’ కూడా 45 లొకేషన్లలో విడుదల అయ్యింది. ఇప్పుడు ‘గ్యారేజ్’ దాన్ని తలదన్నుతూ 48 లొకేషన్స్‌లో రిలీజ్ అవుతోంది. దీంతో.. ఇటు తెలంగాణ, ఆంధ్ర, కేరళ రాష్ట్రాల్లోనే కాకుండా యూఏఈలోనూ ‘గ్యారేజ్’ ద్వారా ఎన్టీఆర్ తన ఖాతాలో అరుదైన రికార్డ్‌ని జమ చేసుకున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ కాపీని ప్రిపేర్ చేసే పనిలో యూనిట్ నిమగ్నమైంది. ఆగస్టు 27వ తేదీలోపు దాన్ని రెడీ చేసి.. ఆరోజే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని చిత్రటీం ప్లాన్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్, మోహన్ లాల్, సచిన్ ఖేడ్‌కర్, ఉన్ని ముకుందన్ తదితర స్టార్స్ నటించారు. కాజల్ అగర్వాల్ ఓ ఐటెం సాంగ్‌లో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి