‘జనతా గ్యారేజ్’ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. ఈరోజు మద్యాహ్నం సెన్సార్‌కు వెళ్ళిన ‘జనతాగ్యారేజ్’ సినిమాను చూసిన సభ్యులు యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చారు.
సినిమాలోని పాటల్లో హీరోయిన్ల గ్లామర్.. అలాగే సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కారణంగా.. సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.కంటెంట్ విషయానికొస్తే.. సినిమాలో ఎన్టీఆర్ అండ్ మోహన్ లాల్ సీన్లు చాలా బాగా వచ్చాయని తెలుస్తోంది. అలాగే రెండు పాటలు కూడా ఇరగదీశాయట. ముఖ్యంగా సమంత గ్లామర్ అండ్ ఎన్టీఆర్ స్టెప్ప్ ఆ పాటల్లో అదిరిపోయాయ్ అని టాక్.
సెన్సార్ పనులు పూర్తికావడంతో ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలకానుంది. నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతానికి, ట్రైలర్‌కు జనాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేగాక హీరోయిన్ కాజల్ అగర్వాల్ జనతా గ్యారేజ్ సినిమాలో నేను పక్కా లోకల్ అనే ఐటం సాంగ్‌లో చిందులేసి సినిమా హైప్‌ను మరింత పెంచేసింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి