పరువు పోకుండా మొక్క నాటింది


తెలంగాణ రాష్ట్రం లో హరితహారం కార్యక్రమం ఎంత విజయం సాధించిందో అందరికి తెలుసు. ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటాలి అనే పిలుపుతో సినీ , రాజకీయ నాయుకులు సైతం మొక్కలు నాటడానికి ముందుకు వచ్చారు. కానీ తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ అయిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాత్రం మొక్క కాదు కదా దాని ప్రస్తావన కూడా పలకకపోవడం తో అందరూ విమర్శించారు.

దీంతో నిన్న సానియా తన ఇంట్లో ఓ మొక్క నాటి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయిన కానీ సోషల్ మీడియా లో మాత్రం కామెంట్స్ ఆగడం లేదు. సానియా నాటిన మొక్క ఖరీదు కోటిరూపాయలు అంటూ కామెంట్స్ వేస్తున్నారు.



కామెంట్‌లు