కబాలి పై రాజమౌళి ఏమన్నారంటే


సౌత్ మొత్తం ఇప్పుడు కబాలి ‘మేనియా’తో వూగిపోతుంది. ఎక్కడ చూసిన కబాలి.. కబాలి. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా కబాలి ఫీవర్ లో వున్నారు. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి కూడా కబాలి నామ స్మరణ చేశారు. రజనీ అంటే రాజమౌళికి ఎంతో ఇష్టం. సామాన్య ప్రేక్షుడిలానే రజనీ సినిమాని ఆస్వాదిస్తుంటారు రాజమౌళి. అయితే కబాలి తొలి ఆట రాజమౌళి మిస్ అయ్యారు. కారణం బాహుబలి షూటింగ్. ఈ విషయాన్ని రాజమౌళే చెప్పారు. ”బాహుబలి’షూటింగ్‌ కారణంగా తొలిరోజు తొలి ఆట చూడలేకపోయా. థియేటర్‌లో ఉండి ఉంటే నేను కూడా ‘తలైవా’మేనియాలో మునిగిపోయి ఉండేవాడిని’అని ట్వీట్ చేశారు రాజమౌళి.

కామెంట్‌లు