ఎన్టీఆర్ నటనని రిప్లేస్ చేయలేము అంటున్న స్టార్ హీరో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేశాడు, యమదొంగ, రాఖీ, బృందావనం, టెంపర్, నాన్నకుప్రేమతో లాంటి ప్రయోగాలు ఎన్టీఆర్ లో ఉన్న నటున్ని మరింత రాటుదేలాలా చేశాయి. కానీ ఈ సినిమాల్లో కూడా టెంపర్ లో ఎన్టీఆర్ పోషించిన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అందరిలోనూ మెప్పుని పొందింది.


కాగా ఈ సినిమాను రీమేక్ చేయాలని సౌత్ లో చాలామంది హీరోలు అనుకున్నా ఎవ్వరూ ఎన్టీఆర్ నటనని రిప్లేస్ చేయలేమని చేతులెత్తేయడం జరిగింది. దాంతో ఈ రీమేక్ ని పట్టాలు ఎక్కకుండానే ఎన్నోసార్లు ఆపేశారు. లేటెస్ట్ గా ఈ సినిమా యంగ్ హీరో విశాల్ చేతిలోకి వచ్చింది.


కానీ ఎన్టీఆర్ నటనని రిప్లేస్ చేయడం నా వల్ల కాదని కానీ ఇదో చాలెంజింగ్ గా తీసుకుని నా వంతు ప్రయత్నం నేను చేస్తానని అంటున్నాడట విశాల్. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నానని రీమేక్ చేసేటప్పుడు అందరూ ఎన్టీఆర్ ని ఊహించుకునే నన్ను చూస్తారు కాబట్టి ఓ కొత్త బాడీ లాంగ్వేజ్ తో ఆ సినిమా చేస్తానని అంటున్నాడట ఈ హీరో.

కామెంట్‌లు