పైరసీ సినిమా రంగాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసి. రిలీజ్ కి ముందే సినిమా మొత్తం ఆన్ లైన్ లో దర్శణమిస్తుండటంతో.. నిర్మాతలు భారీ మొత్తం నష్టపోవాల్సి వస్తోంది. ఇటీవలే బాలీవుడ్ మూవీ ఉడ్తాపంజాబ్ రిలీజ్ కి ముందే నెట్ లో దర్శనమిచ్చింది. సూపర్ స్టార్ రజనీ ‘కబాలి’ రెండు ని॥ల సీన్స్ లీకైంది. అయితే, ‘కబాలి’ ఎఫెక్ట్ పైరసీ పెద్ద చేపని అరెస్ట్ చేయించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పైరసీ వెబ్‌సైట్ కేఏటీ(కిక్ఆస్ టోరెంట్)ను రన్ చేస్తున్న ఉక్రెయిన్ వాసి ఆర్టెమ్ వాలిన్ (30)ను పోలండ్ లో అరెస్టయ్యాడు. సినిమాలు పైరసీ చేస్తూ ఈ వెబ్ సైట్ యేడాదికి రూ. 100కోట్లకి పైగా ఆర్జిస్తోంది. ఆర్టెమ్ వాలిన్ పట్టుకోవడంలో యాపిల్ సంస్థ సహకరించింది. పైరసీ పెద్ద చేప అరెస్ట్ కావడంతో.. సోషల్ మీడియా ఇది కబాలి ఎఫెక్ట్ గా జోకులు పేలుతున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి