రజనీ ‘కబాలి’లో కేసీఆర్ !


సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ సినిమాకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి లింకు ఎక్కడ ఏర్పడింది ? కొప్పతీసి రజనీ ‘కబాలి’లో కేసీఆర్ ఏమైనా గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడా యేంటీ ? అలాంటిదేమీ లేదు. కాకపోతే.. కబాలి ప్రమోషన్స్ లో రజనీ కటౌట్ ప్రక్కనే కేసీఆర్ కటౌట్ కూడా కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. భారీ అంచనాల మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ ఈ రోజు (జులై 22) ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే, కబాలి ప్రమోషన్స్ పీక్స్ చేరిన విషయం తెలిసిందే. ఇక, అభిమానులైతే.. రజనీ కటౌట్స్ తో ఇండియాలో నంబ‌ర్ వ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ అని పేర్కొన్నారు. అయితే, ఓ పోస్టర్ ఇండియాలో నంబ‌ర్ వ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ అని.. ప్రక్కనే కేసీఆర్ ఫోటో ఇండియా లో నెం.1 సీఎం కేసీఆర్ ని రాసి వుంది. ఇప్పుడీ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పోస్టర్ ని చూసి తెరాస శ్రేణులు మురిసిపోతున్నారు.

కామెంట్‌లు