ఈ మధ్య ఆన్‌లైన్ వాడకం బాగా పెరిగింది. నిమిషాల్లో తమకు కావాల్సిన వస్తువులు తమ దగ్గరికే రావడంతో పాటు బయట కంటే ఆన్‌లైన్ లో తక్కువ రేటుకు రావడం తో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్యా రోజురోజుకి బాగా పెరిగిపోయింది. తాజాగా ఓ యువకుడు తక్కువ రేటుకే 11 వేల శ్యామ్‌సంగ్ గెలాక్సీ జె5 ఫోర్‌జీ ఫోన్ వస్తుందని బుక్ చేస్తే అతడికి రూ. 10 నిర్మా సబ్బు వచ్చి షాక్ కు గురిచేసింది. ఈ ఘటన పాలకోడేరు మండలం శృంగవృక్షంలో చోటుచేసుకుంది.
సబ్బు ను చూసి షాక్ అయిన ఆ కుర్రాడు వెంటనే కోరియర్ ఆఫీస్‌కు ఫోన్ చేయగా వారు మెయిల్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీకి సమాచారం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదు చాలా సార్లు ఫోన్లకు బదులు బండ రాళ్లు వచ్చిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి