| Actress Trisha krishnan banked on Drugs |
ఏమీ లేదండీ.. గత ఐదు రోజులగా త్రిషకు ఫుల్లుగా జ్వరం వచ్చిందట. అయితే ఇదే సమయంలో 'నాయికి' క్లయ్ మ్యాక్స్ షూట్ చేయాల్సి ఉంది. త్రిష షూటింగ్ కు రాకపోతే మాత్రం చాలామంది కాంబినేషన్ ఆర్టిస్టుల డేట్లు వేస్టవుతాయి. అందుకే అమ్మడు ఇంజక్షన్లు చేయించుకుని.. మందులు వేసుకొని.. షూటింగ్ కు వచ్చేసింది. అస్సలు జ్వరం ఉన్నట్లు ఏ మాత్రం తెలియకుండా షూటింగ్ పూర్తి చేసేసింది. ఆ ప్రొఫెషనాలిటీ చూసిన దర్శకుడు గోవి.. త్రిష నిజంగానే గొప్ప నాయకి అంటూ పొగిడేస్తున్నాడు.
ఇకపోతే నాయకి టీజర్ ను విడుదల చేశారు. యథావిథిగా ఇది కూడా ఒక హారర్ కామెడీ అని వేరేగా చెప్పక్కర్లేదు. కాకపోతే ఈసారి త్రిష బారిన పడేది ఆమె హీరో సత్యం రాజేష్. క్షణం తో మనోడికి బాగా పాపులార్టీ వచ్చేశాక.. ఈ కాంబినేషన్ ఏదో అదిరేలా ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి