ఫన్నీ ఆన్సర్స్..సెటైర్లు : ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు?

Get upto Rs 100 Free PayTM Cash everyday + Free Mobile Recharges, click here

హైదరాబాద్ : రాజమౌళి తాజా చిత్రం ‘బాహుబలి' విడుదలైన రోజు నుంచి ఒకటే ప్రశ్న నెట్ జనులను, సామాన్యులను ఆలోచనలో పడేస్తోంది. అది మరేదో కాదు... ‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనేదే. ఈవిషయమై సోషల్ మీడియాలో నిరంతరం చర్చ నడుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ముఖ్యంగా నెట్ జనులు జోకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో హల్‌చల్ చేస్తోంది. దీనిని ‘క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్'గా చెప్తూ దానికి తమకు నచ్చిన సమాధానాలతోపాటు ఫోటోలను కూడా పెడుతున్నారు.
బాహుబలిని కట్టప్ప ఎందుకు హతమార్చాడు.. భళ్లాలదేవ ఎలా రాజయ్యాడు.. శివగామి అందుకు సహకరించిందా.. దేవసేనను సంకేల్లతో ఎందుకు బంధించారు.. తండ్రి గురించి తెలుసుకున్న శివుడు తర్వాత ఏం చేస్తాడు.. అవంతికకు దేవసేనకు సంబంధం ఏమిటి.. ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నీ బాహుబలి సినిమా చూసిన ప్రేక్షకులను తొలిచేస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానంగా బాహుబలి ది కంక్లూజన్ పార్ట్ రానుంది.
బాహుబలి సినిమా చివర్లో ‘బాహుబలి'ని నేనే చంపానని కట్టప్ప చెప్పటమే దీనికి కీలకం అయ్యింది. సినిమా ఘన విజయం సాధించటంతో జనం అందరూ దీనిపై చర్చ మొదలెట్టారు . ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. అలా ఫన్ గా ఉన్న వాటిలో కొన్ని ఇక్కడ మీకు అందిస్తున్నాం.
స్లైడ్ షోలో...

1
రిక్వెస్ట్ పంపాడని
దీని ప్రకారం..బాహుబలి..క్యాడీక్రష్ ఆట ఆడుదామని కట్టప్పకు రిక్వెస్ట్ పంపాడు అందుకే చంపేసాడు

2

సత్యరాజ్ కొడుక్కి
సత్యరాజు కొడుకు శిబికు ఇదిగో రోజూ ఇలాంటివి..మీ నాన్నగారు ఎందుకు బాహుబలిని చంపారంటూ వస్తూనే ఉన్నా
యి

కామెంట్‌లు