ఎన్టీఆర్ టెంప‌ర్ చూపించాడు…ప‌వ‌ర్‌స్టార్ రికార్డులు ప‌గిలిపోయాయ్‌..!




యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు టెంప‌ర్ సూప‌ర్ హిట్ అయ్యి సిల్వ‌ర్‌స్ర్కీన్‌ను షేక్ చేసింది. గ‌త ఆదివారం బుల్లితెర‌పై వ‌చ్చిన టెంప‌ర్ బుల్లితెర రికార్డుల‌ను కూడా బ్రేక్ చేసింది. ఇ౦తవరకు తెలుగు సినిమాల్లో అత్యధిక TRP తెచ్చుకున్న సినిమాగా అత్తారి౦టికి దారేది ఉ౦డేది. ఈ సినిమాకు వ‌చ్చిన 24 TRP ని బ్రేక్ చేయాలని చాల సినిమాలే ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి.

 టె౦పర్ సినిమా ఈ నెల 21 న జెమినీ టివిలో ప్రసార౦ అయ్యి 26 రేటి౦గ్‌తో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. రామయ్య వస్తావయ్య, రభస వ౦టి అట్టర్ ఫ్లాఫ్ సినిమాల తరువాత వచ్చినా ఎన్టీఆర్ మీద క్రేజ్ మాత్ర౦ తగ్గలేదు అని చెప్పడానికి ఈ రేటి౦గే నిదర్శనం అని చెబుతున్నారు.
 దీనిని బ‌ట్టి ఎన్టీర్ క్రేజ్ ఏ స్థాయిల ఉందో చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని సినిమా విశ్లేష‌కులు చెపుతున్నారు. ఏదేమైనా యంగ్‌టైగ‌ర్ త‌న స్టామినా ఏమిటో మ‌రోసారి చూపించాడ‌న‌డంలో సందేహ‌మే లేదు.
Share and Enjoy



కామెంట్‌లు