అప్పులన్నీ ఆంఫట్.. జగపతిబాబు మళ్లీ రిచ్
జగపతిబాబు తను సంపాదించింది మొత్తం పోగొట్టేసాడని, ఆర్థికంగా బాగా నష్టపోయాడని అందరికీ తెలిసిన విషయమే. ఆస్తులు మొత్తం కరిగిపోయాయని జగపతిబాబు స్వయంగా అంగీకరించాడు. అందుకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నానని కూడా అన్నాడు. అయితే పోయింది మొత్తం మళ్లీ సంపాదించుకునే పనిలో పడ్డాడు జగపతిబాబు. లెజెండ్ సినిమాలో విలన్‌గా నటించడంతో అతని కెరియర్ మలుపు తిరిగింది. ఇదే ఊపులో జగపతిబాబు మళ్లీ ఆస్తులు వెనకేస్తున్నాడు. ఇప్పుడు సినిమాకొచ్చి జగపతిబాబుకి రెండు కోట్లు ఇస్తున్నట్టు టాక్ ఉంది. కాస్ట్‌లీయస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనిపించుకుంటోన్న జగపతిబాబు ఇప్పుడు పెద్ద చిత్రాల్లో నటిస్తున్నాడు.
మహేష్‌బాబు శ్రీమంతుడులో ఒక కీలక పాత్ర చేస్తోన్న జగపతిబాబు, ఇంకో చిత్రంతో ఎన్టీఆర్‌ని ఇబ్బంది పెట్టే విలన్‌గా కనిపించబోతున్నాడు. తనకున్న డిమాండ్‌కి ఇప్పుడు జగపతిబాబు రెండేళ్లు తిరిగేలోగా పోయిన దాంట్లో సగానికి పైగా సంపాదించేట్టు ఉన్నాడు. కెపిహెచ్‌బి దగ్గర్లోని లోదా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటోన్న జగపతిబాబు అందులోనే ఒక పోష్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్టు సమాచారం. జగ్గూభాయ్ ఈజ్ బ్యాక్ అన్నమాట.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి